అయ్యో పాపం పేదోళ్ళు

>> Monday, September 21, 2009



ముఖ్య మంత్రి మరణానికి మూడు సంతాపాలు
అచ్చూసి పోయిన పేదోడికి పదివేల రూకలు
ఎవడెలా పోయాడొ అడగొచ్చిన వాడికి నీతి పాఠాలు
నిజం చెప్పొచ్చిన వాడినంటారు అడ్డగాడిదా!

అమ్మాయిల పై యాసిడు దాడులు
ఖండిస్తారు టీవీల పెద్దోళ్ళు
రేతిరేళ చూపుతారీ సినిమా కతలు, పగటి పూట
అడిగినోణ్ణి అంటారు అడ్డ గాడిదా!

ప్రజాస్వామ్యం గొప్పదనే పెద్దోళ్ళు వేయిస్తారు
దొంగ వోట్లు, జేబులు నింపుకుని పంచుతారు
నాలుగు రూకలు. ప్రాజాస్వామ్యంబు కాదిది
ధనస్వామ్యంబు అన్న వాణ్ణి అంటారు అడ్డగాడిదా!

ఇప్పటికియ్యి చాలాగానీ, మళ్ళా వస్తానండి!!!

10 comments:

Anonymous September 24, 2009 at 9:25 AM  

malli raa... ;) ;)

వేణూశ్రీకాంత్ September 26, 2009 at 6:01 AM  

తత్వాలు బాగున్నాయి కాని మిమ్మల్ని పిలవాలంటేనే ఇబ్బంది గా ఉందండీ :-) అసలు పేరు ఏదో చెప్పి పుణ్యం కట్టుకోకూడదూ.. కృష్ణమనోహర్ ఐపియస్ అని పిలిచేసుకోమంటారా :-)

కెక్యూబ్ వర్మ September 26, 2009 at 10:53 AM  

వేణు మాటే నాదీనూ. మీది చోడవరం కాదు కదా? ఎందుచేతనంటే మా చోడవరం మిత్రులంతా వ్యంగ్యంలో దిట్టలు. మీ బ్లాగు బాగుంది.

మరువం ఉష September 29, 2009 at 5:06 PM  

అ.గా. గారు, నిలదీసినట్లు మొహమ్మిద కొట్టినట్లు చిన్ని చిన్ని పదాల వ్యంగం పెద్దగా గుప్పించారు. ఇంత బాగా కాదు కాని ఇదే కవిసామ్యంతో, కాస్త వేరే భావవ్యక్తీకరణతో నేనూ వ్రాసుకున్న "త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే స్వర్గమొకటి కట్టేద్దామా? " http://maruvam.blogspot.com/2009/01/blog-post_08.html

భాస్కర రామిరెడ్డి October 14, 2009 at 3:36 PM  

Inni rojulaindi mallostaanani pattaa lekunda poyinaave?

About This Blog

Lorem Ipsum

  © Free Blogger Templates Wild Birds by Ourblogtemplates.com 2008

Back to TOP